తాగునీరు లేక అల్లాడుతున్న హయాన్ తుపాను బాధితులు
ఇటీవల సంభవించిన హయాన్ తుపాను ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెనుతుపాను వల్ల ఆరు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా తినడానికి తిండిలేక, తాగడానికి నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న కలుషిత నీటిని తాగి వీరంతా అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో, కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొండ ప్రాంతాల్లోని వాగుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా, వర్షపు నీటిని పట్టుకుంటున్నారు.